Rivaba Jadeja | గుజరాత్ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం
Rivaba Jadeja | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ టికెట్‌పై నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Rivaba Jadeja | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ టికెట్‌పై నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ.. ‘నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బీజేపీతో పాటు.. నా కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు.. నాకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రజలందరి విజయం’ అంటూ తన విజయంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకుగాను ఇప్పటి వరకు 103 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

