భారత్‌లో 24 గంటల్లో 13వేలకు పైగా కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన కేంద్రం
Rising Covid-19 cases .. Center warns to be vigilant | కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో

న్యూఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య దేశంలో మరోసారి వేగంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో దేశంలో 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని, కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించింది. గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. 33 రోజుల తర్వాత, దేశంలో ఒక్క రోజులో 10వేలకుపైగా కేసులు రావడం మళ్లీ ప్రారంభమైందని, ఈ నెల 26 నుంచి ప్రతిరోజూ 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 82,402 యాక్టివ్ కేసులున్నాయన్నారు.
వారంలో సగటున 8,009 కొత్త కేసులు నమోదవుతున్నాయని, గత మూడు నాలుగు రోజులుగా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎనిమిది జిల్లాల్లో పాజిటివిటీ రేటు పదిశాతం కంటే ఎక్కువగా ఉందని, 14 జిల్లాల్లో వారానికోసారి 5 నుంచి 10శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని, ఈ క్రమంలో నిరంతరం రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.30లక్షల ఒమిక్రాన్ కేసులున్నాయని, ఈ వేరియంట్ కారణంగా 59 మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో 96శాతం, యూకేలో 59శాతం ఒమిక్రాన్‌వేనన్నారు.
ఒమిక్రాన్ తొలి కేసు నమోదైన నాటి నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రతి రోజు సమావేశాలు జరుపడంతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ కేంద్ర బృందాలను పంపుతూ మార్గదర్శనం చేస్తున్నామన్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత 9 నెలల పాటు రోగనిరోధక శక్తి ఉంటుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కొవిషీల్డ్, కొవాక్సిన్ టీకాలు తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి పది నెలల పాటు కొనసాగుతుందని భారత్‌లో మూడు అధ్యయనాలు గుర్తించాయని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

