సంతృప్తితో వెళ్తున్నా

- నా కెరీర్లో ఎన్నో మధుర జ్ఞాపకాలు
- న్యాయవ్యవస్థను ఎన్వీ రమణ సమర్థంగా నడిపించగలరు
- పదవీవిరమణ సందర్భంగా సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే వెల్లడి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే శుక్రవారం పదవీ విరమణ చేశారు. ‘నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నా అత్యుత్తమ పనితీరు కనబర్చాను. ఇతరులు ఏం అనుకొంటున్నారు.. ఎలా అర్థం చేసుకొన్నారన్నది నాకు తెలియదు’ వీడ్కోలు సమావేశంలో అన్నారు. 47వ సీజేఐగా 2019 నవంబర్‌లో పదవీ స్వీకారం చేసిన ఆయన తన 17 నెలల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. అయోధ్య, సమాచార గోప్యత, సీఏఏపై పిటిషన్లు, టాటా-మిస్త్రీ కేసు, తాత్కాలిక జడ్జిల నియామకం ఇలా పలు అంశాల్లో ఆయన చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు. శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్చువల్‌గా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. 21 ఏండ్ల పాటు జడ్జిగా సేవలందించిన తాను.. కోర్టులో సహచర జడ్జిల ద్వారా అత్యంత విలువైన అనుభవాన్ని సాధించానని చెప్పారు. సంతృప్తితో తన పదవికి వీడ్కోలు పలుకుతున్నానని తెలిపారు. ‘సంతోషం, సద్భావం, ఎన్నో జ్ఞాపకాలతో సంతృప్తిగా పదవీవిరమణ చేస్తున్నా. నా శాయశక్తులా కృషి చేశాను’ అని బోబ్డే అన్నారు. పదవిలో చివరి రోజున మాటల్లో చెప్పలేని ఎన్నో మిశ్రమ భావనలు కలుగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు 48వ ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నానని, ఆయన సమర్థంగా నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. 47వ ప్రధానన్యాయమూర్తిగా 2019 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన బోబ్డే.. ఎన్నో కీలక తీర్పులను వెలువరించారు. అందులో అయోధ్య తీర్పు చారిత్రాత్మకమైనది. కొవిడ్ వ్యాపించిన దుర్భర పరిస్థితుల్లోనూ సాంకేతికతను ఉపయోగిస్తూ వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా తీర్పులు ఇచ్చి, న్యాయవ్యవస్థకు ఆటంకం కాకుండా చర్యలు తీసుకున్నారు.
టెక్నాలజీతో కొత్త రకమైన సమానత్వం, అసమానత్వం
కొవిడ్ ఉద్ధృతి ఎంత ఉన్నా సుప్రీంకోర్టు ఒక్కరోజు కూడా మూతపడలేదని జస్టిస్ బోబ్డే గుర్తుచేశారు. కరోనా సంక్షోభంలోనూ కోర్టు అత్యుత్తమ పనితీరు కనబర్చిందన్నారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ‘వర్చువల్ హియరింగ్ ఒక కొత్త రకమైన సమానత్వం, అసమానత్వాన్ని సృష్టించింది. ఇప్పుడు నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. వర్చువల్ హియరింగ్ సాంకేతికతపై ఆధారపడుతుంది. అంటే సాంకేతికత అందుబాటులో ఉంటేనే న్యాయం అందుబాటులో ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

