Retired Judges: న్యాయవ్యవస్థను రక్షించుకుందాం.. సీజేఐకి లేఖ రాసిన రిటైర్డ్ జడ్జీలు
Retired Judges: 21 మంది రిటైర్డ్ జడ్జీలు ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థపై వత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపించారు. తప్పుడు సమాచారం చేరవేస్తున్నారన్నారు. కొందరి వ్యాఖ్యలు న్యాయస్థాన పవిత్రను, జడ్జీలు నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉందన్నారు. అనవసరమైన వత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సి ఉందని ఆ లేఖలో రిటైర్డ్ జడ్జీలు కోరారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ జడ్జీలు(Retired Judges) ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థపై వత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపించారు. తప్పుడు సమాచారం చేరవేస్తున్నారన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం విమర్శకులు అనుచితంగా మాట్లాడుతున్నారని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గే రీతిలో కామెంట్లు చేస్తున్నారని ఆ లేఖలో రిటైర్డ్ జడ్జీలు ఆరోపించారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు మాజీ జడ్జీలు ఉన్నారు. అయితే ఏ కారణంగా వాళ్లు ఆ లేఖ రాశారన్న దాన్ని వివరించలేదు. అవినీతి కేసుల్లో బీజేపీ, విపక్ష పార్టీలు చేస్తున్న కామెంట్లు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆ జడ్జీలు ఆరోపించారు.
రాజకీయ నేతలు, ఆయా పార్టీలు.. పలు కేసుల్లో రిలీఫ్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నాయని, ఆ క్రమంలో న్యాయవ్యవస్థను ఆయా పార్టీలు, నేతలు కించపరుస్తున్నారన్నారు. లేఖ రాసిన రిటైర్డ్ జడ్జీల్లో దీపక్ వర్మ, కృష్ణ మురారి, దినేశ్ మహేశ్వరి, ఎంఆర్ షా ఉన్నారు. న్యాయ వ్యవస్థకు చెందిన కోర్టులు, జడ్జీలపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఈ నలుగురూ పేర్కొన్నారు. కొందరి వ్యాఖ్యలు న్యాయస్థాన పవిత్రను, జడ్జీలు నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఉందన్నారు. అనవసరమైన వత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సి ఉందని ఆ లేఖలో రిటైర్డ్ జడ్జీలు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

