Marine Robot | నీటి లోపల నిఘాకు మెరైన్ రోబో.. అభివృద్ధి చేసిన ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు
నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు.
Marine Robot | న్యూఢిల్లీ: నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్‌కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తున్నది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికం.
ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పని చేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

