రెమ్డిసివిర్ ఇంజెక్షన్ కేవలం వాళ్ల కోసమే..

న్యూఢిల్లీ: ఊపిరి ఆడని కోవిడ్ రోగులకు.. ఆక్సిజన్ అందని వ్యాధిగ్రస్తులకు మాత్రమే రెమ్డిసివిర్ ఇంజెక్షన్ వాడాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో .. చాలా మంది రోగులకు ఊపిరాడని సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీంతో రెమ్డిసివిర్ ఇంజెక్షన్‌కు డిమాండ్ పెరిగింది. ఆ ఇంజెక్షన్లను మితంగా, అవసరాన్ని బట్టి వాడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను కేవలం హాస్పిటళ్లకు మాత్రమే సరఫరా చేయాలని, కెమిస్టులు కానీ రోగులకు ఆ ఇంజెక్షన్లను నేరుగా సరఫరా చేయరాదంటూ ఆరోగ్యశాఖ హెచ్చరించింది. హాస్పిటల్లో చేరిన రోగుల్లో ఎవరికైతే తక్కువ స్థాయిలో ఆక్సిజన్ అందుతుందో వారికి మాత్రమే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇంటి వాతావరణంలో రెమ్డిసివిర్ను వాడవద్దు అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా రెమ్డిసివిర్ ఇంజెక్షన్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్నది. మరో వైపు సుమారు 25వేల రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు కావాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ .. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసర రీతిలో గుజరాత్ నుంచి ఆ ఇంజెక్షన్లు పొందాలంటూ ఆయన తమ ఆరోగ్యశాఖను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

