Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేందుకు 30 రోజుల సెలవులు..!
Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. సంవత్సరంలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్ట్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఆయా సెలవులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు.
Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. సంవత్సరంలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్ట్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు ఆయా సెలవులను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. ఇందులో 20 రోజుల హాఫ్ పే లీవ్, ఎనిమిది రోజుల క్యాజువల్ లీవ్, 2 రోజుల పరిమిత సెలవులు ఉన్నాయి. రాజ్యసభలో ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజులు సెలవు తీసుకునేందుకు అర్హులని.. ఈ సెలవులను వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించవచ్చన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు.. ఈ కారణంతో సెలవు తీసుకునేందుకు ఏమైనా అవకాశాలున్నాయా? అని ఎంపీ సుమిత్రా బాల్మిక్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు, 1972 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజుల సెలవుల్లో 20 రోజులు హాఫ్ పే లీవ్స్, 8 రోజుల క్యాజువల్ లీవ్స్, 2 రోజుల పరిమిత సెలవులతో పాటు ఇతర అర్హత గల సెలవులు ఉంటాయి. ఆయా సెలవులను ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తదితర వ్యక్తిగత కారణాల కోసం తీసుకోవచ్చని కేంద్రమంత్రి తెలిపారు. సదరు ఉద్యోగి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునేందుకని స్పష్టంగా పేర్కొనవచ్చు. అయితే, ఇవేమీ కొత్తగా ఇచ్చే సెలవులేమి కాకపోయినా.. వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విషయం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

