5జీ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్ జియో
Reliance Jio | రిలయన్స్ జియో సంస్థ రెండు నెలల క్రితం ప్రకటించినట్లుగానే ఇవాళ లాంఛనంగా 5జీ సర్వీసులను ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రం
జైపూర్: రిలయన్స్ జియో సంస్థ రెండు నెలల క్రితం ప్రకటించినట్లుగానే ఇవాళ లాంఛనంగా 5జీ సర్వీసులను ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్జీ ఆలయంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దాంతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఏడాది పూర్తయ్యే లోపల దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా ప్రధాన నగరాలన్నింటిలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ జియో కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి, మండలానికి, తాలూకాకు 5జీ నెటవర్క్‌ను విస్తరించాలన్నది తమ ఉద్దేశమని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు.
ఈ ఏడాది ప్రారంభంలో ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో బోర్డుకు రాజీనామా చేసి తన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీకి ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కాగా, రిలయన్స్ కంపెనీ 5జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. 5జీ స్టాండలోన్ పేరుతో 5జీ తాజా వెర్షన్‌ను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

