Crime News | మద్యంలో కలుపుకునేందుకు నీళ్లు తేలేదని బాలుడిని కాల్చిచంపిన బంధువు
Crime News | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీళ్లు తీసుకురాలేదన్న చిన్న కారణంతో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల బాలుడిని కాల్చిచంపాడు. పైగా మృతుడికి హంతకుడు బంధువే కావడం గమనార్హం. కాస్గంజ్ జిల్లా (Kasganj district) లోని యాకుత్‌గంజ్ (Yakutganj) గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Crime News : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీళ్లు తీసుకురాలేదన్న చిన్న కారణంతో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల బాలుడిని కాల్చిచంపాడు. పైగా మృతుడికి హంతకుడు బంధువే కావడం గమనార్హం. కాస్గంజ్ జిల్లా (Kasganj district) లోని యాకుత్‌గంజ్ (Yakutganj) గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌గంజ్ గ్రామంలోని జస్వీర్ గోలా (Jashvir Goli) ఇంట్లో నామకరణ వేడుక జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు.
అదే సమయంలో జస్వీర్ బంధువైన ధనేశ్ యాదవ్ మద్యం తాగుతున్నాడు. అక్కడే ఆడుకుంటున్న జస్వీర్ కుమారుడిని పిలిచి మద్యంలో కలుపుకోవడానికి నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. అందుకు ఆ బాలుడు నిరాకరించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న ధనేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న తుపాకితో బాలుడి కడుపులో కాల్చాడు. ఈ ఘటనతో వేడుకలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని మొదట కాస్గంజ్ జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో అలీగఢ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం బాలుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఖితౌలీ కాలువ వంతెన వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవింద్ వల్లభ్ శర్మ తెలిపారు. నిందితుడిని జైలుకు పంపే ప్రక్రియ ప్రారంభించామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్పీ రాజేశ్ కుమార్ భారతి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

