Lord Wellesley | సైన్య సహకార ఒప్పందమే.. మన కొంప ముంచిందా?
Lord Wellesley | సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను...
Lord Wellesley | సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది. భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు.
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహాల్లో సైన్య సహకార ఒప్పందం ఒకటి. దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి, బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి. లార్డ్ వెల్లస్లీ (1798- 1805) రూపొందించిన ఈ పథకం బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాణంలో కీలకంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందాన్ని అంగీకరించే భారతీయ రాజ్యాలు తమ భూభాగంలో బ్రిటిష్ సైన్యాలు ఉండటానికి అంగీకరించాలి. వారి పోషణ ఖర్చును స్థానిక పాలకులే చెల్లించాలి. అలా చేయలేకపోతే కొంత భూభాగాన్ని కంపెనీకి ఇచ్చేయాలి. ఫలితంగా అంతర్గతంగా, బాహ్యంగా దాడులు జరగకుండా ఒప్పందానికి అంగీకరించిన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లు కాపాడతారు. అయితే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ, ఆచరణలో అది దాదాపుగా శూన్యం. అంతేకాకుండా ఒప్పందంలో భాగమైన రాజ్యం మరే ఇతర విదేశీ శక్తితో ఎలాంటి సంబంధమూ కలిగి ఉండకూడదు.
ఇంగ్లిష్ వాళ్లు కాకుండా ఇతర దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. అప్పటికే ఎవరైనా ఉద్యోగంలో ఉంటే ఒప్పందం కాగానే తొలగించాలి. బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఇతర భారతీయ రాజ్యాలతోనూ ఒప్పందాలు చేసుకోకూడదు. అలా సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది. భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. రాజ్యాలు స్వతంత్రం కోల్పోయాయి. సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన తొలి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం కావడం గమనార్హం. నిజాం రాజు, కంపెనీ మధ్య ఈ ఒప్పందం 1798లో కుదిరింది. మైసూరు, తంజావూరు, అవధ్, పీష్వా, సిందియా, గైక్వాడ్ తదితర పాలకులు కూడా ఈ ఒప్పందానికి లోబడ్డవారే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

