Ration Card | రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కాదు.. ప్రజా పంపిణీ కోసమే: హైకోర్టు
Ration Card | రేషన్ కార్డు (Ration Card) అడ్రస్ ప్రూఫ్ కాదని, ప్రజా పంపిణీ కోసం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందేందుకు ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారని పేర్కొంది.
న్యూఢిల్లీ: రేషన్ కార్డు (Ration Card) అడ్రస్ ప్రూఫ్ కాదని, ప్రజా పంపిణీ కోసం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందేందుకు ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డును చిరునామా లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని కాత్పుత్లీ కాలనీని అభివృద్ధి చేసిన తర్వాత పునరావాస పథకం కింద ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని కోరుతూ పూర్వపు నివాసితులు దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చంద్ర ధారి సింగ్ విచారణ జరిపారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరి ధృవీకరణ పత్రంగా రేషన్ కార్డు ఉండాలని అధికార నోటీస్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధమని అన్నారు.
కాగా, రేషన్ కార్డు నిర్వచనం ప్రకారం దానిని జారీ చేయడంలో ప్రభుత్వం ఉద్దేశాన్ని న్యాయమూర్తి వివరించారు. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడమే రేషన్ కార్డు లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డును అడ్రస్ ప్రూఫ్ లేదా నివాస గుర్తింపు రుజువుగా పరిగణించలేమని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

