Rape Accused: ఆ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన ఢిల్లీ సీఎం
Delhi CM Kejriwal :చనిపోయిన స్నేహితుడి మైనర్ కూతుర్ని రేప్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ యాక్షన్ తీసుకున్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఆఫీసర్ ప్రేమోదయ్‌ను సస్పెండ్ చేశారు. ఇవాళ సాయంత్రంలోగా ఆ ఘటనపై రిపోర్టు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. బాలిక గర్భం దాల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారిపై ఇవాళ ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నెలల క్రితం 14 ఏళ్ల బాలికను రేప్ చేసినట్లు (Rape Accused)ఆఫీసర్ ప్రేమోదయ్ ఖాకాపై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆఫీసర్ స్నేహితుడి కూతురే ఆ బాలిక. 2020-21 మధ్య కాలంలో ఆ అమ్మాయిపై ప్రేమోదయ్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనపై రిపోర్టు ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. ఆఫీసర్ ప్రేమోదయ్ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డారని, అతనికి ఆయన భార్య కూడా సహకరించినట్లు తేలిందని ఆప్ నేతలు ఆరోపించారు.
డబ్ల్యూసీడీ శాఖలో ప్రేమోదయ్ ఖాకా డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్నారు. మైనర్ తండ్రి మరణించిన తర్వాత ప్రేమోదయ్ ఇంట్లోనే ఆమె ఉంటోంది. అయితే రెండేళ్ల నుంచి ఆ ఆఫీసర్ రేప్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రేప్ నిందితుడి ఇంటికి ఇవాళ పోలీసులు వెళ్లారు. బాలిక గర్భం దాల్చినట్లు తెలియగానే.. నిందితుడి భార్య ఆ బాలికకు మెడిసిన్ ఇచ్చినట్లు తెలిసింది. నిందితుడు ప్రేమోదయ్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఢిల్లీ మహిళా కమీషన్ చీఫ్ స్వాతి మాలివాల్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

