CM Kejriwal | రాముడు ఎప్పుడూ కులాన్ని నమ్మలేదు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు..!
CM Kejriwal | భగవాన్ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
CM Kejriwal | భగవాన్ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు ఎప్పుడూ కులాన్ని నమ్మలేదని, రామరాజ్యంలో అందరూ తమ మతాన్ని పాటించేవారన్నారు. రామయణంలా రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామన్నారు. రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అన్నారు. వృద్ధులను అయోధ్య రామ దర్శనానికి పంపుతామని సీఎం ప్రకటించారు. రామాయణంలోని రామరాజ్యానికి నిర్వచనంలా నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాముడు అనుసరించిన సూత్రాలను పాటించడం ముఖ్యమన్నారు.
విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, ఢిల్లీ ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూడాలని కేజ్రీవాల్ అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామాలయానికి తమ ప్రభుత్వం త్వరలో యాత్రకు పంపనున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటి వరకు 83వేల మందికిపైగా వృద్ధులను తీర్థయాత్రలకు పంపామన్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్య యాత్ర ప్రారంభించాలని చాలా అభ్యర్థనలు వచ్చాయని, త్వరలోనే వీలైనంత మందిని అక్కడికి తీసుకెళ్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

