Ram Mandhir | అయోధ్యలో కల్లోలం సృష్టిస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే బెదిరింపు..!
Ram Mandhir | ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహ్మద్ (Jaish e Mohammed) కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది.
Ram Mandhir : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహ్మద్ (Jaish e Mohammed) కూడా అయోధ్యలో కల్లోలం సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడింది.
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దాంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించాయి. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జనవరి 26 సందర్భంగా కూడా జైషే ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది.
రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పన్నూ శుక్రవారం హెచ్చరికలు పంపాడు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

