Ram Lalla Idol | ప్రాణప్రతిష్ఠకు ముందే భక్తుల ముందుకు బాలరాముడి దివ్యరూపం.. ఫోటో వైరల్
Ram Lalla Idol | ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తోంది. బాలరాముడి విగ్రహం తయారీ తర్వాత కార్యశాలలో దించిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ram Lalla Idol | ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తోంది. బాలరాముడి చేతిలో బంగారు వర్ణంలో ఉన్న విల్లు, బాణం ఉంది. బాలరాముడి విగ్రహం తయారీ తర్వాత కార్యశాలలో దించిన ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఫోటోపై స్పందించింది. అదే బాలరాముడి దివ్యరూపం అని తెలిపింది. శుక్రవారం ఉదయం కళ్లకు గంతలతో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నల్లటి (కృష్ణశిల) పద్మపీఠంపై బాలరాముడు దర్శనిమచ్చాడు. ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించిన విషయం తెలిసిందే.
అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాస్తవానికి గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ట కోసం మూడు విగ్రహాలను ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు సిద్ధం చేయించారు. వాటిల్లో కర్ణాటకకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భ గుడిలో కొలువుదీరనుంది. ఈ విగ్రహాన్ని కోట్లాది మంది భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో ప్రాణ ప్రతిష్ట జరుపుకోనున్న ఈ బాల రామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arvind Kejriwal: 7 కోట్లు ఇవ్వండి.. కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు
మోటకొండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
Jagga Reddy | సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా : జగ్గారెడ్డి
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

