Adil Khan Durrani | మరో పెళ్లి చేసుకున్న రాఖీ సావంత్ మాజీ భర్త.. ఆశీర్వదించండి అంటూ పోస్ట్
Adil Khan Durrani | ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ (Adil Khan Durrani) మరో వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ (Bigg Boss 12 Contestant) సోమి ఖాన్ (Somi Khan)ను మనువాడాడు.
Adil Khan Durrani | ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్ మాజీ భర్త ఆదిల్ ఖాన్ దురానీ (Adil Khan Durrani) మరో వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ 12 కంటెస్టెంట్ (Bigg Boss 12 Contestant) సోమి ఖాన్ (Somi Khan)ను మనువాడాడు. ఈ విషయాన్ని ఆదిల్ దురానీ తాజాగా ప్రకటించారు. తాను ఈ నెల 3న వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. పెళ్లి ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఎంతో ఘనంగా జరిగినట్లు చెప్పాడు. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్న తమని ఆశీర్వదించండి అంటూ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రాఖీ సావంత్, ఆదిల్ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము పెళ్లి చేసుకున్నాం అంటూ గతేడాది జనవరిలో ప్రకటించారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు ఆదిల్‌ను అరెస్ట్ చేశారు. ఐదు నెలల తర్వాత జైలునుంచి విడుదలైన ఆదిల్.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చాడు.
Also Read..
Rupert Murdoch | లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఐదో పెళ్లికి సిద్ధమైన 93 ఏళ్ల బిలియనీర్
Sudha Murty | ఇదో కొత్త బాధ్యతగా భావిస్తున్నా.. రాజ్యసభకు నామినేట్ కావడంపట్ల సుధామూర్తి రియాక్షన్
Sudha Murty | రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి.. నారీ శక్తికి నిదర్శనం అంటూ మోదీ ట్వీట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

