Samajwadi Party: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ రాజీనామా.. రాజ్యసభ ఎన్నికల వేళ అఖిలేశ్‌కు జలక్
Samajwadi Party: యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్‌కు భారీ జలక్ తగిలింది.
లక్నో: కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ( Samajwadi Party) చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్‌కు భారీ జలక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఓ పార్టీని అఖిలేశ్ ఆర్గనైజ్ చేశారు. అయితే ఆ పార్టీకి మనోజ్ పాండే హాజరుకాలేదు. యూపీలో జరుగుతున్న పది స్థానాల కోసం 8 మంది బీజేపీ నుంచి, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మనోజ్ పాండే తన రాజీనామా గురించి అఖిలేశ్‌కు లేఖ రాశారు. మీరు నన్ను యూపీ అసెంబ్లీ కోసం చీఫ్ విప్‌గా నియమించారు. ఆ పోస్టుకు నేను రిజైన్ చేస్తున్నాను, దాన్ని మీరు ఆమోదించాలని మనోజ్ తన లేఖలో కోరారు. రాయ్‌బరేలీలోని ఉంచహార్ నియోజకవర్గం నుంచి మనోజ్ పాండే ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అఖిలేశ్ సర్కారులో ఆయన మంత్రిగా చేశారు.
సోమవారం జరిగిన ఎస్పీ మీటింగ్‌కు.. ఆ పార్టీకే చెందిన 8 మంది నేతలు హాజరుకాలేదు. మనోజ్‌తో పాటు ముకేశ్ వర్మ, మహారాజి ప్రజాపతి, పూజా పాల్, రాకేశ్ పాండే, వినోద్ చతుర్వేది, రాకేశ్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్ ఆ మీటింగ్‌కు వెళ్లలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

