ప్రధాని మోదీని మౌని బాబా అన్న ఖర్గే.. ఆగ్రహించిన రాజ్యసభ చైర్మన్ ధన్కర్
Mallikarjun Kharge | ఇవాళ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. గౌతమ్ అదానీ విషయంలో ప్రధాని మోదీ ఇంతవరకు పెదవి విప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యూఢిల్లీ: ఇవాళ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే.. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. గౌతమ్ అదానీ విషయంలో ప్రధాని మోదీ ఇంతవరకు పెదవి విప్పకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీని మౌని బాబాగా అభివర్ణించారు. అయితే, ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ ధనకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌని బాబా అనే పదప్రయోగం మీ హోదాకు తగినది కాదని హెచ్చరించారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారో తాను అడగ దల్చుకున్నానని, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రధాని పారిశ్రామికవేత్తల విషయంలో ఎందుకుండరని ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టే నేతలపట్ల ప్రధాని కటువుగా ఉంటే.. ఈసారి టికెట్ వస్తుందో రాదోనని భయపడుతారని, కానీ ప్రధాని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌని బాబాలా ఉంటున్నారని విమర్శించారు.
దాంతో రాజ్యసభ చైర్మన్ ధన్కర్ సీరియస్ అయ్యారు. అలాంటి పదాలు వాడటం మీ హోదాకు తగినది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడి మాటలు సభలోని సభ్యులందరి మాటలను ప్రతిబింబించాలని వ్యాఖ్యానించారు. దయచేసి సభలో హూందాగా మాట్లాడాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

