Agneepath Scheme | పాత విధానాన్నే కొనసాగిస్తున్నాం : రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
Agneepath Scheme | ‘అగ్నిపథ్ స్కీమ్’పై మరోసారి వివాదం రాజుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన కులం, మతానికి సంబంధించిన సర్టిఫికెట్లు కోరుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పాత విధానం ప్రకారమే మిలటరీ రిక్రూట్మెంట్ జరుగుతుందని స్పష్టం చేశారు.
స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నామన్నారు. అయితే, అగ్నిపథ్ స్కీమ్ ర్రికూట్‌మెంట్‌లో కుల, మత ధ్రువీకరణపత్రాలు కోరడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, జేడీయూ నేత ఉపేంద్ర కుష్వాహ పలు ప్రశ్నలు సంధించారు. దీంతో వివాదం రాజుకున్నది. అయితే, దీనిపై సైన్యం సైతం ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్ స్కీమ్ కింద సైనిక రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాత విధానాన్నే కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. గతంలోనూ కుల, మత ధ్రువీకరణపత్రం తీసుకున్నామని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

