Rajiv Gandhi | ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయండి..! రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్..!
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పయస్, జయకుమార్ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు.
Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పయస్, జయకుమార్ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారిద్దరినీ గతేడాది పుజాల్ సెంట్రల్ జైలు నుంచి మురుగన్ తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరానికి తరలించార. ఇద్దరు హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరూ.. ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఇదే కేసులో ఎంటీ శాంతన్‌ను సైతం స్పెషల్ క్యాంపు నుంచి తనను విడుదల చేయాలని ఇంతకు ముందు కోరారు.
ప్రత్యేక క్యాంపు గదిలోని కిటికీ సైతం మూసే ఉందని.. ఇతరులను కలిసే స్వేచ్ఛ తనకు లేదని శాంతన్ ముందు ఆరోపించారు. ప్రత్యేక శిబిరంతో పోలిస్తే జైలే బాగుండేదని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో రాజీవ్ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అనంతరం నిందితులను ప్రత్యేక శిబిరంలో ఉంచారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురుగన్, నళిని, ఏజీ పెరారివాలన్, సంతన్, జయకుమార్, రాబర్ట్ పయాస్, పీ రవిచంద్రన్‌లతో ఏడుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికీ మరణశిక్ష విధించగా.. ఆ తర్వాత జీవితఖైదుగా మార్చారు. ఏడుగురు ఖైదీల్లో ఏజీ పెరారివాలన్ 2022 మేలో జైలు నుంచి విడుదలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

