Polling | రాజస్థాన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకల్లా పోలింగ్ శాతం ఎంతంటే..!
Polling | రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలోని 199 స్థానాల్లో సగటున 40.27 శాతం పోలింగ్ నమోదైంది.
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలోని 199 స్థానాల్లో సగటున 40.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుందని, ఐదింటి లోపు క్యూలైన్లలో నిలబడి ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
కాగా, రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగాను ఇవాళ 199 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతున్నది. కరన్‌పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ కూనర్ మరణించడంతో అధికారులు ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

