Date Of Birth On Wedding Cards | పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు తప్పనిసరి.. బాల్య వివాహాలపై కఠిన చర్యలు
Date Of Birth On Wedding Cards | బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
జైపూర్: బాల్య వివాహాలను నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి అని పేర్కొంది. (Date Of Birth On Wedding Cards) బాల్య వివాహాలపై నిఘా పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజస్థాన్‌లో చాలా ఏళ్లుగా అక్షయ తృతీయ (అఖా తీజ్), పీపాల్ పూర్ణిమ పండుగల సందర్భాల్లో బాల్య వివాహాలు జరుగుతాయి.
కాగా, ఈ పండుగల దృష్ట్యా రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. వధూవరుల వయస్సు రుజువును వారి కుటుంబాల నుంచి పొందాలని, పెళ్లి ఆహ్వాన కార్డుపై ఇద్దరి పుట్టిన తేదీలు ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్‌లను ఆదేశించింది. అలాగే పెళ్లి తంతులో కీలకమైన పురోహితులు, టెంట్ హౌస్‌లు, బ్యాండ్ మేళాలు, క్యాటర్లు, రవాణాదారులు వంటి అన్ని వర్గాలను అధికారులను సంప్రదించాలని పేర్కొంది.
మరోవైపు బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని, బాల్య వివాహ నిషేధ చట్టంపై అన్ని వర్గాలను చైతన్యం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు, పోలీస్ అధికారులు ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. బాల్య వివాహాలను నివారించడానికి ప్రభుత్వ యంత్రాంగాలను చురుకుగా ఉంచాలని సూచించింది. రాజస్థాన్ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్ ఈ మేరకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

