Rajasthan Elections | రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
జైపూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ (Polling) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. కరన్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనార్ (Gurmeet Singh Koonar) మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదాపడింది.
199 స్థానాలకు గాను 1862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 5.25 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1.71 కోట్ల మంది 18 నుంచి 30 ఏండ్ల వయస్సులోపు వారే కావడం విశేషం. ఈ సారి కొత్తగా 22.61 లక్షల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు. దీంతో పార్టీల భవితవ్యాని యువ ఓటర్లే నిర్ణయించనున్నారు.
కాగా, 59 మంది సిట్టింగ్‌లకు ప్రతిపక్ష బీజేపీ మరోసారి అవకాశం ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలను మళ్లీ బరిలో నిలిపింది. పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే ఉన్నా.. సీపీఎం, ఆర్ఎల్పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆప్, ఎంఐఎం కూడా బరిలో నిలిచాయి. కాంగ్రెస్, బీజేపీలకు 40 స్థానాల్లో రెబెల్స్ నుంచి పోటీ ఎదురవుతున్నది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Voting begins for the Rajasthan Assembly elections
(Visuals from a polling booth in Jodhpur)#RajasthanElection2023 pic.twitter.com/BSiVJQwsm8
— ANI (@ANI) November 25, 2023
#WATCH | Rajasthan Elections | A voter on a wheelchair being helped by her family to reach the polling booth, at a polling station in Sardarpura, Jodhpur. pic.twitter.com/V2f6Dp1J4u
— ANI (@ANI) November 25, 2023
#WATCH | Rajasthan Elections | Voters queue up at a polling station in Jaipur; voting for the state assembly election began at 7 am. pic.twitter.com/9s7djqsrm1
— ANI (@ANI) November 25, 2023
#WATCH | Rajasthan Elections | Voters queue up at a polling station in Kota South Assembly constituency; voting for the state assembly election began at 7 am. pic.twitter.com/1aCi4iBnx5
— ANI (@ANI) November 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

