Exit Polls 2023 | రాజస్థాన్లో అధికారం దక్కించుకోనున్న బీజేపీ?
Exit Polls 2023 | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. బీజేపీకి 100-110, కాంగ్రెస్కు 90-100, ఇతర పార్టీలకు 5- 15 సీట్లు రావచ్చని గ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
జైపూర్: రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. మ్యాజిక్ మార్క్ 100. అయితే బీజేపీకి 100-110, కాంగ్రెస్కు 90-100, ఇతర పార్టీలకు 5- 15 సీట్లు రావచ్చని గురువారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా తెలుస్తున్నది.
దైనిక్ భాస్కర్ అంచనా ప్రకారం బీజేపీకి 98-105, కాంగ్రెస్కు 85-95, ఇతర పార్టీలకు 10-15 సీట్లు రానున్నాయి.
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీకి 80-100, కాంగ్రెస్కు 86-106, బీఎస్పీకి 1-2, ఇతర పార్టీలకు 8-16 సీట్లు దక్కనున్నాయి.
ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ అంచనా ప్రకారం బీజేపీకి 80-90, కాంగ్రెస్కు 94-104, ఇతరులు 14-18 స్థానాల్లో గెలుస్తాయి.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 100-122, కాంగ్రెస్కు 62-85, ఇతర పార్టీలకు 14-15 సీట్లు రానున్నాయి.
పీ-మార్క్యూ అంచనా మేరకు బీజేపీకి 105-125, కాంగ్రెస్కు 69-91, ఇతర పార్టీలకు 5-15 స్థానాలు దక్కనున్నాయి.
రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ సర్వే ప్రకారం బీజేపీకి 115-130, కాంగ్రెస్కు 65-75, ఇతర పార్టీలు 12-19 సీట్లు గెలుస్తాయి.
టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ మేరకు బీజేపీకి 108-128, కాంగ్రెస్కు 56-72, ఇతరులకు 13-2 స్థానాలు రానున్నాయి.
టీవీ 9 భరత్వర్ష్ – పోల్స్టర్ ప్రకారం బీజేపీకి 100-110, కాంగ్రెస్కు 90-100, ఇతర పార్టీలు 05-15 సీట్లు గెలువనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Exit Polls
- predicted
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

