పెట్రోల్‌లో 31.2% ఇథనాల్!
చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే పెట్రోల్‌లో నిర్దేశిత ఇథనాల్ 20%(ఈ20) మిశ్రమం కంటే గణనీయంగా ఎక్కువ ఉందని కర్ణాటక ప్రభు త్వం శుక్రవారం పేర్కొంది. వివిధ కంపెనీల పెట్రోల్ నమూనాలను పరీక్షించగా పలు నమూనాలలో ఇథనాల్ గాఢత 20%కి మించి ఉన్నట్టు గుర్తించామని,
- నిర్దేశించిన ప్రమాణాలకు మించి ఇథనాల్ మిశ్రమం
- కర్ణాటక ప్రభుత్వ పరీక్షల్లో వెల్లడి
బెంగళూరు, నవంబర్ 6: చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే పెట్రోల్‌లో నిర్దేశిత ఇథనాల్ 20%(ఈ20) మిశ్రమం కంటే గణనీయంగా ఎక్కువ ఉందని కర్ణాటక ప్రభు త్వం శుక్రవారం పేర్కొంది. వివిధ కంపెనీల పెట్రోల్ నమూనాలను పరీక్షించగా పలు నమూనాలలో ఇథనాల్ గాఢత 20%కి మించి ఉన్నట్టు గుర్తించామని, అధికంగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు ఆర్థిక నష్టాలకు గురయ్యేఅవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటక వ్యాప్తంగా ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, షెల్ వంటి ప్రధాన చమురు విక్రయ సంస్థల నుంచి మొత్తం 63 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను మొదట ఆయా చమురు విక్రయ సంస్థల ప్రయోగశాలలకు పంపారు.
వీటితో పాటు కొన్ని ప్రశ్నలను కూడా జత చేశారు. అందులో ప్రతి నమూనాలో ఉన్న ఇథనాల్ పరిమాణానికి సంబంధించిన వివరాలను కోరే ప్రశ్న కూడా ఉంది. అయితే, ఇథనాల్ పరిమాణంపై ఆయా కంపెనీలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని, ఇందులో ఏదో తేడా ఉందనే అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిందని సమాచారం. ప్రభుత్వం ఆ నమూనాలను స్వతంత్ర పరీక్షల కోసం ప్రైవేట్ ప్రయోగశాలలకు పంపింది. బెంగళూరు అర్బన్ సహా ఏడు జిల్లాల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో ఇథనాల్ గాఢత 20% అనే ప్రామాణిక స్థాయిని మించి ఉన్నట్టు తెలిసింది. ఈ నమూనాలను బెంగళూరుకు చెందిన శ్రీరామ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించింది.
ఈ సంస్థకు నేషనల్ అక్రెడిటేషన్ ఆఫ్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్(ఎన్ఏబీఎల్) గుర్తింపు ఉంది. అంతేగాక ఈ సంస్థ ఐఎస్వో ధృవీకరణ పొందింది. ఇది ఈ20 ఇంధనం కాదు. ఇందులో ఇథనాల్ శాతం ఐవోసీఎల్ వద్ద 31.2% కంటే ఎక్కువగా, హెచ్‌పీసీఎల్ వద్ద 30.5%, బీపీసీఎల్ వద్ద 26.5%, నయారా వద్ద 26.1%, షెల్ వద్ద 25.5%గా ఉంది అని కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలు ఇంధన నాణ్యత నిర్దేశించిన ఇథనాల్ మిశ్రమానికి సంబంధించిన పరిమితిని పాటించడం, అలాగే తగ్గిన మైలేజీ, పెరిగిన వాహన నిర్వహణ ఖర్చుల రూపంలో వినియోగదారులపై పడే ప్రభావం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
సరళంగా చెప్పాలంటే ఈ20 పెట్రోల్‌లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉండాలి. ఒకవేళ ఈ ఫలితాలు నిర్ధారణ అయితే 25.5% లేదా 30.5% ఇథనాల్ ఉన్న నమూనాలు నిర్ణీత ప్రమాణం నుంచి గణనీయంగా పక్కకు తొలగినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. ఉదాహరణకు హెచ్‌పీసీఎల్‌కి చెందిన ఒక రకమైన పెట్రోల్‌లో(ఎంఎస్-పవర్) 30. 5% ఇథనాల్ ఉండగా, మరొక రకమైన పెట్రోల్‌లో(ఎంఎల్) 27% ఇథనాల్ ఉన్నట్టు గుర్తించారు. బీపీసీఎల్‌కు చెందిన స్పీడ్ పెట్రోల్‌లో 26.5 శాతం, నయారా పెట్రోల్‌లో 26.1 శాతం, షెల్ పెట్రోల్‌లో 25.5 శాతం ఇథనాల్ ఉన్నట్టు ఫలితాల్లో తేలింది. బీపీసీఎల్‌కు చెందిన రెండు నమూనాలలో వరుసగా 24.2 శాతం, 22.6 శాతం ఇథనాల్ ఉండగా, హెచ్‌పీసీఎల్‌కు చెందిన ఒక నమూనాలో 22.4 శాతం, అలాగే ఐవోసీఎల్కు చెందిన మరో నమూనాలో 20.8 శాతం ఇథనాల్ ఉన్నట్టు నమోదైంది. మిగిలిన పెట్రోల్ నమూనాలలో నయారా పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 20.6గా, బీపీసీఎల్ నమూనాలో 19.9గా, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ నమూనాలో 19.2గా షెల్ నమూనాలో 13.5గా నమోదయ్యాయి.
నష్టపరిహార నిధి కోసం డిమాండ్
పెట్రోల్‌లో అధికంగా ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గడం, వాహన నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి నష్టాలకు వాహనదారులకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం ఒక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయాలని కర్ణాటక మంత్రి రిజ్వాన్ అర్షద్ డిమాండ్ చేశారు. వాహనాల మైలేజీ 10 శాతం తగ్గితే వాహనదారులకు ఏడాదికి రూ.62, 000 కోట్ల నష్టం వాటిల్లవచ్చని, అలాగే ఇంధనంలో ఇథనాల్‌ను అధికంగా కలపడం వల్ల వాహనాల ఖర్చులు మరో రూ.30,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

