Caste Census: కుల గణనపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన అఖిలేశ్ యాదవ్
Caste Census: కుల గణన గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను అఖిలేశ్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు కుల గణన చేపట్టలేదని అఖిలేశ్ ప్రశ్నించారు.
సాత్నా: ప్రతిపక్ష ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కుల గణన(Caste Census) గురించి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు వైరుధ్య అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపట్టలేదని ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని సాత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు తప్పుడు విధానాలతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. కుల గణన గురించి రాహుల్ గాంధీ కామెంట్ చేసిన నేపథ్యంలో అఖిలేశ్ విమర్శించారు. కుల గణన చేపట్టాలని, అది ఎక్స్ రే లాంటిదని, దాని వల్ల విభిన్న వర్గాల సమాచారం తెలుస్తుందని రాహుల్ ఓ సభలో మాట్లాడుతూ తెలిపారు. కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఇదో మిరాకిల్ అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలకు అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఎక్స్ రే అవసరం అని, ఇప్పుడు ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు అందుబాటులో ఉన్నాయని, ఆ వ్యాధి ఇప్పుడు వ్యాపించిందని, అప్పుడే ఆ సమస్యను పరిష్కరిస్తే, ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదన్నాడు. కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం వింత అని, ఎక్స్ రే గురించి మాట్లాడే వ్యక్తులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కుల గణన చేపట్ట లేదన్నారు. కుల గణన చేయాలని ములాయం, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ లోక్సభలో డిమాండ్ చేసినా.. కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించినట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

