PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ..!
PM Modi | కులగణనలో వివరాల సేకరణ విధానంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఎండెడ్’ విధానాన్ని మార్చి.. కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
PM Modi : కులగణనలో వివరాల సేకరణ విధానంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఎండెడ్’ విధానాన్ని మార్చి.. కులాల పేర్లతో కూడిన డ్రాప్‌డౌన్ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుత విధానంలో వ్యక్తులు తమ కులం పేరును ఎలా చెబితే అలా నమోదు చేస్తారని ఖర్గే, రాహుల్ పేర్కొన్నారు.
ఒకే కులానికి ప్రాంతాలను బట్టి వేర్వేరు పేర్లు, ఉపకులాలు, భాషా రూపాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఒకే కులానికి చెందినవారి వివరాలు వేర్వేరు పేర్లతో నమోదైతే.. ఆ కులం వేలాది ఎంట్రీలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలా జరిగితే కులాల జనాభాపై కచ్చితమైన సమాచారం లభించదని తెలిపారు. ఫలితంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, ఇతర అణగారిన వర్గాల స్థితిగతులపై సరైన అంచనా సాధ్యం కాదన్నారు.
విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలపై దీని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో ఓబీసీల వాస్తవ జనాభా ఎంత అన్నది కూడా తేలకపోవచ్చని కాంగ్రెస్ నేతలు అన్నారు. కులగణనలో ‘బ్యాక్వర్డ్ క్లాస్’ అనే పదం చేర్చలేదని లేఖలో ప్రస్తావించారు. కులాల పేర్లతో డ్రాప్‌డౌన్ జాబితా రూపొందించాలని వారు సూచించారు. ఎస్సీ, ఎస్టీల గణనలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపారు.
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రభుత్వ జాబితాలు, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించవచ్చన్నారు. తెలంగాణ, బీహార్ కుల సర్వేల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రశ్నావళిని రద్దుచేసి.. రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని ఖర్గే, రాహుల్ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

