Rahul Gandhi | రాహుల్‌గాంధీ స్టైల్ అదిరిందిగా.. జుట్టు, గడ్డం ట్రిమ్ చేసి కొత్త లుక్‌తో ప్రత్యక్షం..!
Rahul Gandhi | ఇవాళ ట్రిమ్ చేసిన జట్టు, గడ్డం, మీసాలతోపాటు సూటు, టైతో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి రాహుల్ నయా లుక్‌పై కామెంట్ల వర్షం కురుస్తున్నది.
లండన్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ స్టైల్ మార్చారు. ట్రిమ్ చేసిన జుట్టు, గడ్డం, మీసంతో ఆయన కొత్త లుక్కుతో ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ముగిసిన భారత్ జోడో యాత్ర ఆసాంతం రాహుల్‌గాంధీ.. పొడవాటి జట్టు, పెరిగిన గడ్డం, మీసాలతోపాటు తెల్లటి టీ-షర్ట్లు ధరించి కనిపించేవారు. తాజాగా లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమం కోసం యూకేకు విచ్చేసే వరకు అదే వేషధారణలో కనిపించారు.
కానీ, ఇవాళ ట్రిమ్ చేసిన జట్టు, గడ్డం, మీసాలతోపాటు సూటు, టైతో ప్రత్యక్షమైన రాహుల్‌గాంధీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి రాహుల్ నయా లుక్‌పై కామెంట్ల వర్షం కురుస్తున్నది. లండన్ పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కీలక ప్రసంగం చేయనున్నారు. అదేవిధంగా అక్కడి భారతీయులతో కాసేపు ముచ్చటించనున్నారు. ‘లిజనింగ్-లెర్నింగ్ ఇన్ ద 21st సెంచరీ’ అనే అంశంపై రాహుల్ లెక్చర్ ఇవ్వనున్నారు.
భారతదేశపు ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీని మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌కు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మా కేంబ్రిడ్జి బిజినెస్ జడ్జి బిజినెస్ స్కూల్ విజిటింగ్ ఫెలోగా ‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద 21st సెంచరీ’ అనే అంశంపై ప్రసంగం చేయనున్నారు అని కేంబ్రిడ్జి జేబీఎస్ మంగళవారం ట్వీట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

