Ragging | విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతానికి 51 మంది బలి
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం.
- విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌పై నివేదిక
Ragging | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం. సొసైటీ ఎగెనెస్ట్ వయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రచురించిన ‘భారత దేశంలో ర్యాగింగ్ పరిస్థితి, 2022-24’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ర్యాగింగ్ ఘటనలపై ఫిర్యాదులు అత్యధికంగా వైద్య కళాశాలల నుంచి వస్తున్నాయని తెలిపింది.
జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు 1,946 కళాశాలల నుంచి 3,156 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 38.6 శాతం వైద్య కళాశాలల నుంచి వచ్చాయి. ఈ ఫిర్యాదులు కేవలం హెల్ప్‌లైన్ ద్వారా నమోదైనవేనని, నేరుగా కళాశాలలు, పోలీసులకు బాధితులు చేసిన ఫిర్యాదులు ఇంకా ఎక్కువే ఉంటాయని ఈ నివేదిక రూపకర్తలు తెలిపారు. 2022-24 మధ్య రాజస్థాన్‌లోని కోటాలో 57 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కళాశాలలు యాంటీ ర్యాగింగ్ స్కాడ్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ నివేదిక సూచించింది. ఈ స్కాడ్‌ను సంప్రదించేందుకు ఫోన్ నంబరు తదితర వివరాలను కొత్త విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

