Watch: మొబైల్లో గేమ్ ఆడుతున్న బాలుడు.. ఆ గదిలోకి ప్రవేశించిన చిరుత, తర్వాత ఏం జరిగిందంటే?
Boy Locks Leopard In Room | ఒక బాలుడు మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.
ముంబై: ఫంక్షన్ హాల్ ఆఫీస్ రూమ్‌లో ఒక బాలుడు మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ బాలుడు షాక్ అయ్యాడు. అయితే ఏ మాత్రం భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. మెల్లగా ఆ గది నుంచి బయటకు వచ్చి డోర్ లాక్ చేశాడు. (Boy Locks Leopard In Room) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు మాలేగావ్‌లోని వెడ్డింగ్ హాల్ ఆఫీస్‌లో 12 ఏళ్ల మోహిత్ అహిరే మొబైల్లో గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో ఒక చిరుత ఆ రూమ్‌లోకి ప్రవేశించింది.
కాగా, చిరుతను చూసి మోహిత్ అహిరే తొలుత భయపడ్డాడు. అయితే ఆ బాలుడు వెంటనే తెలివిగా వ్యవహరించాడు. మెల్లగా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే డోర్ లాక్ చేశాడు. తండ్రి వద్దకు వెళ్లి చిరుత సంగతి చెప్పాడు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ చిరుతను బంధించారు. మరోవైపు ఆ బాలుడు చాకచక్యంగా చిరుత బారి నుంచి తప్పించుకుని దానిని బంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Nashik: Quick-Thinking 12-Year-Old Locks #Leopard In Room, CCTV Footage Goes Viral#Maharashtra pic.twitter.com/lFJDmNmcDS
— Free Press Journal (@fpjindia) March 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Boy
- leopard
- Locks
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

