Navy Veterans | ఖతర్ నుంచి భారత్ చేరుకున్న నేవీ మాజీ అధికారులు
దౌత్యపరంగా భారత్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతర్ ప్రభుత్వం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దౌత్యపరంగా భారత్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో (Spying charges) అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ (Indian Navy) మాజీ అధికారులను ఖతర్ (Qatar) ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో ఇప్పటికే ఏడుగురు ఢిల్లీకి చేరుకున్నారు. నౌకాదళ మాజీ అధికారులకు (Navy Veterans) విధించిన మరణ శిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి వారిని భారత్‌కు అప్పగించింది. దీంతో ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎనిమిది మంది పౌరులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్‌లో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తున్నదని అందులో పేర్కొన్నది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారని తెలిపింది. వీరి విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్’ తీసుకున్న నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని వెల్లడించింది.

2022లో గూఢచర్యం ఆరోపణల కింద ఇండియన్ నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ సిబ్బందిని ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, సౌరభ్ వశిష్ఠ్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, ఏపీలోని విశాఖకు చెందిన సుగుణాకర్ పాకాల, సెయిలర్ రాగేశ్ ఉన్నారు. అయితే అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి వారికి మరణ శిక్ష విధించింది. దానిని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న భారత విదేశాంగ శాఖ వారి విడుదలకు కృషి చేసింది. అవన్నీ ఫలించడంతో 18 నెలల తర్వాత సోమవారం ఉదయం వారు స్వదేశానికి చేరుకున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

