Watch: కుక్కపిల్లతో మద్యం తాగించిన యువకులు.. వీడియో వైరల్
Puppy Made To Drink Whiskey | కొంతమంది యువకులు సరదాగా కుక్కపిల్లతో మద్యం తాగించారు. (Puppy Made To Drink Whiskey) దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు.
జైపూర్: కొంతమంది యువకులు సరదాగా కుక్కపిల్లతో మద్యం తాగించారు. (Puppy Made To Drink Whiskey) దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ యువకులపై చర్యలకు సిద్ధమయ్యారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఈ సంఘటన జరిగింది. షేరు బోర్డా అనే యువకుడు తన స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. వారంతా ఒక చోట చలి మంట వేసుకున్నారు. మద్యం తాగి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఒక కుక్కపిల్లతో మద్యం తాగించారు. విస్కీ ఉన్న ప్లాస్టిక్ గ్లాస్‌ను దాని ముందు ఉంచారు. దీంతో ఆ కుక్కపిల్ల ఆ మద్యం తాగింది.
కాగా, ఆ యువకులు దీనిని వీడియో తీశారు. అంతేగాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలకు మద్యం హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కపిల్లతో మద్యం తాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు స్పందించారు. నిందితులపై తగిన చర్యలు చేపడతామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
in logo ko itne log follow karte hai pr inke karam nahi dekhte kitne gande log hai kitna shota bacha hai jaan ja sakti hai @SPsawaimadhopur @PoliceSawai plz🙏 iss bande pe karwahi ki jaye @RajPoliceHelp @PoliceRajasthan @RajCMO @SurajSDubey_ @JesudossAsher @asharmeet02 @Bratin_v https://t.co/nqnFMHwJ1v pic.twitter.com/l8odn4hq7l
— voiceforanimals11 (@vfanimals11) January 5, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

