రాబోయేది కిసాన్ సర్కారే : నిజామాబాద్‌లో పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్
punjab speaker kultar singh | కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారేనని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో
హైదరాబాద్ : కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారేనని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్, డిప్యూటీ స్పీకర్ జై సింగ్, ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సహని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్ జీత్ సింగ్ నిజామాబాద్ పర్యటనకు రాగా.. ప్రతినిధుల బృందానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుల్తార్ సింగ్ సాంద్వాన్ మాట్లాడారు. పంజాబ్‌లో ఆప్ కొత్తగా అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ అభివృద్ధి బాగుందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలువుతన్న పథకాలు దేశాన్నే ఆలోచింపజేస్తున్నాయన్నారు. రైతులకు వెన్నుదనున్నగా రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేలు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు కరెంటు ఇస్తున్నారని ప్రశంసించారు. మనం వేసుకునే చెప్పులకు ధర ఉంది కానీ.. కేంద్రం రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ముందుచూపుతో నీటి కొరత లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఇవ్వడం హర్షనీయమన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల తాను ఒకే కాలేజీలో చదువుకున్నామని, వారితో ఉన్న సాన్నిహిత్యంతో నిజామాబాద్ నగరానికి వచ్చామన్నారు. నిజామాబాద్ నగరం గణేశ్ బిగాల నేతృత్వంలో బాగా అభివృద్ధి చెందిందన్నారు. కలెక్టరేట్, ఐటీ హబ్‌లు అద్భుతంగా ఉన్నాయన్నారు. బిగాల గణేశ్ ఆతిథ్యం సంతోషాన్ని కలిగించిందన్నారు. కిసాన్ సర్కార్ కోసం పనిచేస్తున్న కేసీఆర్‌కు అందరం మద్దతివ్వాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ నుడ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

