Railway Track Blast: పంజాబ్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేత.. బాంబు విస్పోటనంతో ముక్కలైన నిందితుడు
Railway Track Blast: రేల్వే ట్రాక్‌ను పేల్చబోయాడు.. ఆ బాంబు ఆపరేటర్ కూడా దాని పేలుడుకు బలయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలాలో జరిగింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను పేల్చాడు. ఆ క్రమంలో అతను కూడా ముక్కలైనట్లు తెలుస్తోంది.
చండీఘడ్: పంజాబ్‌లోని పాటియాలా సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద పేలుడు(Railway Track Blast) ఘటన జరిగింది. అయితే బాంబును పేల్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడని, ఆ బాంబును ఆపరేట్ చేయబోయి ఆ వ్యక్తి కూడా చనిపోయినట్లు సీనియర్ పోలీసు ఆఫీసర్ ఒకరు తెలిపారు. రైల్వే ట్రాక్‌ను పేల్చుదామని ప్రయత్నించిన ఆ వ్యక్తి గురించి కొన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. శంబూ, రాజ్‌పురా మార్గంలో ఉన్న బొతోనియా గ్రామం వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో పేలుడు జరిగింది. అయితే అక్కడ ఓ వ్యక్తి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. బాంబునే పేల్చే క్రమంలో అతను చనిపోయి ఉంటాడని పాటియాలా ఎస్ఎస్పీ వరుణ్ శర్మ తెలిపారు.
శంబూ-అంబాలా రైల్వే ట్రాక్ మార్గంలో ప్రస్తుతం రిపేర్ వర్క్ చేస్తున్నారు. బాంబు పేలుడులో మరణించిన వ్యక్తిని జగరూప్ సింగ్‌గా గుర్తించారు. అతను తరన్ తారన్‌కు చెందినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే ట్రాక్‌ను పేల్చబోయి, నిందిత ఆపరేటర్ కూడా పేలినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ కాస్త ధ్వంసం అయ్యింది. కొన్ని రైళ్లను దారి మళ్లీంచారు. తక్కువ తీవ్రతతో బాంబు పేలిందని తొలుత భావించామని, కానీ దాన్ని పేల్చే ప్రయత్నంలో నిందితుడు కూడా పేలి ముక్కలైనట్లు ఎస్పీ వెల్లడించారు.
ఆ స్పాట్ నుంచి ఓ సిమ్ కార్డును రికవరీ చేశామన్నారు. దీని ఆధారంగా టెక్నికల్ దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను చేధించనున్నట్లు పోలీసులు చెప్పారు. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై జనవరిలో పేలుడు జరిగింది. ఆ ఘటనలో ఇంజిన్ ధ్వంసం కాగా, లోకో పైలెట్ గాయపడ్డ విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

