సిద్ధూ బాధ్యతల స్వీకారానికి హాజరుకానున్న సీఎం

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ భవన్కు ఆహ్వానించారు. అనంతరం అంతా కలిసి కాంగ్రెస్ భవనానికి చేరుకుని కొత్త పీపీసీసీ బృందం బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం మీడియా సలహాదారుడు తెలిపారు.
మరోవైపు కొత్త పీసీసీ టీంను ఆశీర్వదించేందుకు శుక్రవారం జరిగే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని సీఎం అమరీందర్ సింగ్ను సిద్ధూ గురువారం మరోసారి ఆహ్వానించారు. ఈ మేరకు రెండోసారి లేఖ రాశారు. ఈ లేఖపై 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేశారు. కాగా, కాంగ్రెస్ చీఫ్గా సిద్ధూ నియమకాన్ని వ్యతిరేకించిన సీఎం అమరీందర్ సింగ్, క్షమాపణలు చెప్పేంత వరకు ఆయనను కలువబోనని ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం హాజరవుతారా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని ఆయన మీడియా సలహాదారుడు పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కార్యక్రమంలో సిద్దూ, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కుల్జిత్ సింగ్ నాగ్రా, సంగత్ సింగ్ గిల్జియాన్, పవన్ గోయెల్, సుఖ్వీందర్ సింగ్ డానీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పంజాబ్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ పార్టీ హైకమాండ్ ప్రతినిధిగా హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

