పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం భగవంత్ మాన్
పంజాబ్‌లో ఆప్ సర్కార్ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తెలిపారు.
చండీఘఢ్ : పంజాబ్‌లో ఆప్ సర్కార్ రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తెలిపారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆప్ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ ప్రలోభాలకు తెరలేపిందని మంత్రులు ఆరోపిస్తున్న క్రమంలో సీఎం భగవంత్ మాన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
రాజ్‌భవన్, ఆప్ సర్కార్ మధ్య పలు రోజుల పాటు సాగిన సంవాదం అనంతరం సెప్టెంబర్ 27న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జీఎస్టీ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీని ఒకరోజు సమావేశపరచాలని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిన మీదట గవర్నర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమోదం తెలిపారు.
ఇక సెప్టెంబర్ 22న విశ్వాస తీర్మానం చేపట్టేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని అంతకుముందు ఆప్ ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. తమ సర్కార్‌ను కూల్చేందుకు పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఏకంగా రూ 25 కోట్లు ఆఫర్ చేసిందని పాలక పక్షం ఆరోపణలు గుప్పించింది. పంజాబ్ అసెంబ్లీలో 117 మంది సభ్యులుండగా 92 మంది సభ్యులతో ఆప్‌నకు పూర్తి మెజారిటీ ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

