‘మోదీ.. హిందీని మాపై రుద్దొద్దు’.. నిప్పంటించుకుని తమిళనాడు రైతు ఆత్మహత్య
తలైయూర్లోని డీఎంకే కార్యాలయం వద్దకు తంగవేల్ చేరుకున్నాడు. కేంద్రం బలవంతంగా హిందీని రుద్దడంపై నిరసన తెలిపాడు.
చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యా మాధ్యమంగా హిందీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై వృద్ధుడైన ఒక రైతు ఆందోళన చెందాడు. ‘మోదీ.. హిందీని మాపై రుద్ద వద్దు’ అంటూ నినాదాలు చేసి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లాలోని తలైయూర్లో శనివారం ఈ సంఘటన జరిగింది. రైతైన 85 ఏళ్ల తంగవేల్, డీఎంకే వ్యవసాయ సంఘం మాజీ ఆర్గనైజర్. దేశ వ్యాప్తంగా హిందీలో విద్యా బోధనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన కలత చెందాడు. దీని వల్ల నిరుపేద, రైతు కుటుంబాల విద్యార్థులు నష్టపోతారని ఆందోళనకు గురయ్యాడు.
కాగా, శనివారం ఉదయం తలైయూర్లోని డీఎంకే కార్యాలయం వద్దకు తంగవేల్ చేరుకున్నాడు. కేంద్రం బలవంతంగా హిందీని రుద్దడంపై నిరసన తెలిపాడు. ‘మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.. మాకు హిందీ వద్దు. మా మాతృభాష తమిళం. హిందీ విదూషకుల భాష. హిందీ భాషను రుద్దితే విద్యార్థుల జీవితాలపై ప్రభావం పడుతుంది. హిందీ వద్దే వద్దూ’ అన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. అనంతరం వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. సజీవంగా కాలిపోయి అక్కడే చనిపోయాడు.
మరోవైపు డీఎంకే కార్యకర్త అయిన తంగవేల్ ఆత్మహత్యపై తమిళనాడులోని అధికార పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ విద్యా సంస్థల్లో హిందీ బోధనను అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేస్తామని సీఎం స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువజన సంఘం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

