Protesters, police clash in Bihar | నీట్ లీక్‌పై బీహార్ బంద్ హింసాత్మకం.. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు
Protesters, police clash in Bihar | నీట్ పేపర్ లీక్‌పై బీహార్‌లో రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థుల నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన తేజ్ ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాట్నా: నీట్ పేపర్ లీక్‌పై బీహార్‌లో రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థుల నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించిన తేజ్ ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (Protesters, police clash in Bihar) నీట్ లీక్ వివాదంపై శనివారం బంద్ సందర్భంగా బీహార్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీస్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు పలు జిల్లాల్లో రోడ్లను దిగ్బంధించారు. పాట్నా, ఛప్రా, ఔరంగాబాద్‌లో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు బాష్పాయువు ప్రయోగించడంతో పాటు ఒక దశలో కాల్పులు కూడా జరిపారు.
కాగా, జనశక్తి జనతా దళ్ (జేజేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్, పాట్నాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. అయితే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాట్నాలోని గాంధీ మైదాన్, రామ్ గులాం చౌక్ సమీపంలో నిరసనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. ట్రాఫిక్ పోలీస్ బూత్, పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణపడ్డారు.
మరోవైపు పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో కొందరు సిబ్బంది గాయపడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించినట్లు వివరించారు.
#BREAKING | Attack on Siwan Police in Bihar in the name of a student protest!
Police personnel are being chased and beaten.
Police used tear gas shells and resorted to a mild lathi-charge to disperse the crowd. pic.twitter.com/8TzjBiPSgC
— Organiser Weekly (@eOrganiser) July 25, 2026
#WATCH | Bihar: Students protest in Patna turn violent as protesters clash with Police.
A statewide shutdown has been called today over the NEET paper leak issue and Police action during student protests in the state. pic.twitter.com/JFMmHUHg7d
— ANI (@ANI) July 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

