లక్నో: కాలేజీ ప్రొఫెసర్ (UP Professor) పలువురు మహిళా స్టూడెంట్స్‌ను లైంగికంగా వేధించాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్ వికృత చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలోని భౌగోళిక విభాగం ప్రొఫెసర్ రజనీష్ కుమార్ పలువురు మహిళా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కాగా, మార్చి 13న ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు ఒక అనామక ఫిర్యాదు అందింది. లేడీ స్టూడెంట్స్‌తో ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వీడియోలు రికార్డ్ చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ‘మోదీ ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పఢావో’కు మద్దతు ఇస్తుంది. కానీ, ఆ తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు కుమార్తెలపై క్రూరత్వానికి పాల్పడుతున్నారు. ఈ క్రూరమైన వ్యక్తి నన్ను చాలా బాధపెడుతున్నాడు. కొన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. దయచేసి విద్యార్థినులను రక్షించండి. అవమానం కారణంగా ఏ విద్యార్థిని బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, దయచేసి ఈ రాక్షసుడిపై కఠిన చర్యలు తీసుకోండి. నాలాంటి చాలా మంది అమ్మాయిలకు న్యాయం చేయండి’ అని ఆ లేఖలో వేడుకున్నది.
మరోవైపు ఆ ప్రొఫెసర్ గత ఏడాదిన్నరగా విద్యార్థినులపై ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళా కమిషన్, ఇతర సీనియర్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించింది. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోలీసులకు పంపింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, అజ్ఞాత మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ప్రొఫెసర్ రజనీష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి దారుణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన అజ్ఞాత మహిళ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రొఫెసర్ రజనీష్‌పై కాలేజీ యాజమాన్యం కూడా చర్యలు చేపట్టింది. ఆయనపై కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసింది.
हाथरस: प्रोफेसर रजनीश कुमार का छात्राओं संग अश्लील वीडियो वायरल, FIR दर्ज! लेकिन मीडिया खामोश क्यों? क्या नाम देखकर खबरों की अहमियत तय होती है? सोचिए, अगर यही कोई उर्दू नाम वाला प्रोफेसर होता तो…? #MediaBias #Hathras #viralvideo pic.twitter.com/sMUsRX44XA
— Voice Of Justice (@InsafKiAawaz) March 16, 2025
Hathras: A monster hiding in the temple of education!
Professor Rajnish Kumar of Seth PG Bagla Degree College, Hathras was sexually abusing girl students for 20 years! Police registered a case after more than 50 objectionable videos and pictures went viral.
📌 The college… pic.twitter.com/SpwJ4d3XOx
— Emotional_Accused (@Emotional7979) March 16, 2025