హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత, ముఖ్యమంత్రి (Chief Minister) కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే పదవిలో ఉండగా ఓ ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయవచ్చా అనే సందేహాలు వ్యక్తవుతున్నాయి. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు.
కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుంది. కాబట్టి, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.