Priyanka Gandhi | వాయనాడ్‌లో రాహుల్‌గాంధీ రికార్డు బ్రేక్.. భారీ మెజారిటీతో ప్రియాంకాగాంధీ గెలుపు
Priyanka Gandhi | కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4,08,0036 ఓట్ల మెజారిటీతో ఆమె భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Priyanka Gandhi : కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4,08,0036 ఓట్ల మెజారిటీతో ఆమె భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
దాంతో వాయనాడ్ లోక్‌సభ స్థానంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు ప్రియాంకాగాంధీ సోదరుడు రాహుల్‌గాంధీ పేరిట ఉంది. రాహుల్‌గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీగా ఉంది. ఇప్పుడు 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంకాగాంధీ ఆ రికార్డును బద్ధలు కొట్టారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ తన సిట్టింగ్ స్థానమైన వాయనాడ్‌తోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. దాంతో ఆయన వాయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆ స్థానంలో తన సోదరి ప్రియాంకాగాంధీని బరిలో దించారు. వాయనాడ్ ఓటర్లు ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

