లండన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్న ప్రిన్సెస్ డయానా పెండ్లి కిరీటం
యువరాణి డయానా పెండ్లి సందర్భంగా ధరించిన కిరీటాన్ని లండన్‌లో సోత్బే నిర్వహిస్తున్న ప్రత్యక క్రౌన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు.
లండన్ : యువరాణి డయానా పెండ్లి సందర్భంగా ధరించిన కిరీటాన్ని లండన్‌లో సోత్బే నిర్వహిస్తున్న ప్రత్యక క్రౌన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. 1981లో ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్‌తో జరిగిన పెండ్లి వేడుకలో ధరించిన క్రౌన్‌ను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తారు. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జుబ్లీ వేడుకల సందర్భంగా ఈ ప్రత్యేక భారీ క్రౌన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు. మే 28 నుంచి జూన్ 15 వరకూ ఈ ప్రదర్శన జరుగుతుంది.
ఈ ఎగ్జిబిషన్లో అద్భుతంగా రూపొందిన 50 రకాల క్రౌన్లను ప్రదర్శిస్తారు. వీటిలో కొన్ని పీస్‌లను తొలిసారిగా ప్రజల ముందుంచుతున్నారు. ప్రిన్సెస్ డయానా ఈ ప్రత్యేక క్రౌన్‌ను 1982 నుంచి 1992 మధ్య ఏడు సార్లు ధరించారు. రాయల్ టూర్స్, ఇతర హైప్రొఫైల్ ఈవెంట్స్‌లో ఆమె ఈ నగను ధరించారు. ప్రసిద్ధ గార్లాండ్ స్టైల్ డిజైన్‌లో వజ్రాలతో కూడిన సెంట్రల్ హార్ట్ షేప్‌లో తయారుచేయబడిన ఈ క్రౌన్ ఆకట్టుకుంటుంది.
వెండి , బంగారంతో అమర్చబడిన నక్షత్రంతో ట్రంపెట్ ఆకారపు పువ్వులతో ఈ క్రౌన్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ ఆభరణం లేడీ డయానా ఆమె అమ్మమ్మ సింథియ హామిల్టన్‌కు సెంటిమెంటల్ క్రౌన్గా మారిందని చెబుతారు. లేడీ హామిల్టన్‌కు 1919లో వివాహం సందర్భంగా ఈ క్రౌన్ బహుమతిగా అందిందని సౌత్‌బే ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diana
- Exhibition
- london
- Princess
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

