గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తుది శ్వాస విడవడంపై రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మాతృభూమి కోసం అత్యంత ధైర్య పరాక్రమాలతో ఆయన సేవలు చేశారని కొనియాడారు.
రాంనాథ్ కోవింద్ (రాష్ట్రపతి)
ఈ దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. ఆయన చూపిన ధైర్య సాహసాలు, పరాక్రమం అద్భుతమైనవి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను
నరేంద్ర మోదీ (ప్రధాని)
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి చెందడం చాలా బాధగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అత్యంత గర్వంగా, వృత్తి నిపుణతతో ఈ మాతృభూమికి సేవలు చేశారని ట్విట్టర్ వేదికగా ప్రధాని కొనియాడారు. ఆయన మరణించడం చాలా బాధగా ఉందని, దేశం కోసం ఆయన చేసిన సేవలు ప్రజలెప్పటికీ మరిచిపోరని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.