Predator Drones | మూడు ప్రధాన కేంద్రాల్లో ప్రిడేటర్ డ్రోన్ల మోహరింపు..!
Predator Drones | పాక్, చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘాను పెంచేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది.
Predator Drones | పాక్, చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘాను పెంచేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది. అమెరికా పర్యటన సందర్భంగా 31 ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు ప్రణాళికను భారత్, అమెరికా ప్రకటించారు. ఈ డ్రోన్లను మూడు ప్రధాన భాగాల్లో మోహరించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీనియర్ డిఫెన్స్ అధికారుల ప్రకారం.. మూడు ప్రధాన భాగాల్లో ఒకటి ఉత్తర లేదంటే.. వాయువ్య ప్రాంతంతో పాటు మరొకటి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది.
2020-21లో చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రెండు ప్రిడేటర్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకొని మోహరించింది. ఆయా డ్రోన్లకు ఐఎన్ఎస్ రాజాలి హబ్‌గా ఉన్నది. త్రివిధ దళాలు ఈ డ్రోన్లను బేస్‌ల నుంచి సైతం నిర్వహిస్తాయి. లీజుకు తీసుకున్న డ్రోన్లను జనరల్ అటామిక్స్ ప్రతినిధులు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు మూడు సర్వీసులకు చెందిన భారతీయ పైలట్లు డ్రోన్ల నిర్వహణకు భారత్‌తో పాటు అమెరికాలోనూ శిక్షణ పొందనున్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా డ్రోన్లను నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. లాంగ్ ఎండ్యూరన్స్ రకానికి చెందిన మానవరహిత వైమానిక వాహనాల సంఖ్యను తెలుసుకోవడానికి ట్రై సర్వీస్ అధికారులు వివరణాత్మక శాస్త్రీయంగా విశ్లేషించారు.
‘హెలికాప్టర్లు, డ్రోన్లు, వాయు రక్షణ ఆయుధ వ్యవస్థలతో సహా ట్రై సర్వీస్ అన్ని భవిష్యత్ ఒప్పందాలు అదే పద్ధతిలో జరుగుతాయి’ ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ రెండు ప్రధాన శత్రుదేశాలతో విస్తారమైన భూభాగంతో పాటు సముద్ర సరిహద్దులను పంచుకుంటున్నది. ఇందులో ఒకటి పాక్ కాగా.. మరొకటి చైనా. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు.. శత్రుదేశాల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం అవసరమని సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రిడేటర్ డ్రోన్లను MQ-9 రీపర్ పేరుతో పిలుస్తుంటారు. నిరంతరంగా 36 గంటల వరకు ఎగురగలవు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

