DGP Prashant Kumar: యూపీ తాత్కాలిక డీజీపీగా ప్రశాంత్ కుమార్
DGP Prashant Kumar: ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా ప్రశాంత్ కుమార్‌ను నియమించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న ఆయనకు.. డీజీపీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. అయితే వరుసగా నాలుగవ సారి యూపీ డీజీపీ పోస్టును తాత్కాలిక హోదాలో నియమించడాన్ని అఖిలేశ్ యాదవ్ తప్పుపట్టారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా ప్రశాంత్ కుమార్(DGP Prashant Kumar)ను నియమించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న ఆయనకు.. డీజీపీ బాధ్యతలను అప్పగించారు. అయితే వరుసగా నాలుగవ సారి యూపీ డీజీపీ పోస్టును తాత్కాలిక హోదాలో నియమించారు. దీన్ని విపక్ష నేత ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఖండించారు. ఎందుకు ప్రతిసారి డీజీపీలను తాత్కాలిక హోదాలో నియమిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ, లక్నో మధ్య ఉన్న సంబంధాల వల్లే ఇలా జరుగుతోందా అని ఆయన అడిగారు. ప్రభుత్వం, క్రిమినల్స్ మధ్య ఒప్పందాలు ఉన్నట్లు ఆరోపించారు.
ప్రస్తుత డీజేపీ విజయ్ కుమార్ ఇవాళ రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో ప్రశాంత్ కుమార్.. తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనది బీహార్. 2022 మే 11వ తేదీన ముఖుల్ గోయల్ ను తొలగించిన తర్వాత యూపీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయి డీజీపీని నియమించలేదు. ఆ రాష్ట్రానికి వరుసగా తాత్కాలిక డీజీపీని నియమించడం ఇది నాలుగవసారి. గోయల్ ప్రస్తుతం సివిల్ డిఫెన్స్ డీజీగా ఉన్నారు.
గోయల్ తర్వాత డీఎస్ చౌహాన్, ఆర్కే విశ్వకర్మ, ఆ తర్వాత విజయ్ కుమార్‌లను తాత్కాలిక డీజీపీలుగా నియమించారు. గత ఏడాది మే 31వ తేదీన విజయ్ కుమార్‌ను యాక్టింగ్ డీజీపీగా నియమించారు.
लगता है एक बार फिर उप्र को कार्यवाहक डीजीपी मिलनेवाला है। जनता पूछ रही है कि हर बार कार्यवाहक डीजीपी बनाने का खेल दिल्ली-लखनऊ के झगड़े की वजह से हो रहा है या फिर अपराधियों के संग सत्ता की साँठगाँठ के कारण।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 31, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

