Sambhal MP: విద్యుత్తు చోరీ.. సంభల్ ఎంపీకి 1.91 కోట్ల జరిమానా
Sambhal MP : సంభల్ ఎంపీ ఇంట్లో విద్యుత్తు చోరీ జరిగింది. ఆ ఘటనలో కేసు బుక్ చేసింది విద్యుత్తు శాఖ. దీనికి తోడు ఆ ఎంపీకి 1.91 కోట్ల ఫైన్ కూడా విధించింది.
సంభల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ ఎంపీ(Sambhal MP) జియా ఉర్ రెహ్మాన్‌కు.. ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ 1.91 కోట్ల జరిమాన విధించింది. విద్యుత్తును చోరీ చేసిన ఘటనలో.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై విద్యుత్తు చట్టం సెక్షన్ 135 ప్రకారం కేసు బుక్ చేశారు. ఆ ఎంపీ ఇంటికి విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేశారు. విద్యుత్తు శాఖ అధికారులను బెదిరించిన ఘటనలోనూ ఆ ఎంపీ తండ్రి మామ్లూకర్ రెహ్మాన్ బర్క్‌ను కూడా కేసు కింద బుక్ చేశారు.
దీప్ సరాయి ఏరియాలో ఉన్న ఇంటికి ఇన్స్పెక్షన్ కోసం వెళ్లిన సిబ్బందిని బర్క్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మీటర్లను నిర్వీర్యం చేసి, అక్రమ రీతిలో ఎంపీ ఇంట్లో విద్యుత్తును వినియోగిస్తున్నట్లు విద్యుత్తు శాఖ సిబ్బంది గుర్తించింది. నవంబర్ 24వ తేదీన సంభల్‌లోని షాహి జామా మసీదు ఘటనలో ఎంపీ రెహ్మాన్‌పై కేసు బుక్ చేసిన విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం ఎంపీ ఇంట్లో స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేశారు. అయితే పాత మీటర్లను పరిశీలిస్తే, గత ఆర్నెల్ల నుంచి ఆ మీటర్లు జీరో యూనిట్ చూపించాయి. ఆ రెండు మీటర్లను ల్యాబ్‌కు పంపగా, ఎంఆర్ఐ టెస్టులో ఆ మీటర్లు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

