సీఈవో అదార్ పూనావాలాగా నమ్మించి.. సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కోటికిపైగా లూటీ
ఈ స్కామ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ముంబై: ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలాగా నమ్మించిన మోసగాళ్లు ఆ సంస్థ నుంచి కోటికిపైగా లూటీ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐఐ డైరెక్టర్లలో ఒకరైన సతీష్ దేశ్‌పాండే వాట్సాప్‌కు సెప్టెంబర్‌లో ఒక మేసేజ్ వచ్చింది. అదార్ పూనావాలాగా నమ్మించిన ఒక వ్యక్తి పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయాలని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. అయితే ఆ వాట్సాప్ మెసేజ్ అదార్ నుంచి వచ్చినట్లుగా డెరెక్టర్ సతీష్ భావించారు. దీంతో ఆ మేజేస్లో పేర్కొన్న 8 బ్యాంకు ఖాతాలకు రూ.1.01 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు.
కాగా, మోసం జరిగినట్లు ఆ సంస్థ వెంటనే గ్రహించింది. దీంతో చీటింగ్ చేసి కోటికిపైగా దోచుకున్న వ్యవహారంపై పూణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించారు. డబ్బులు బదిలీ అయిన ఎనిమిది బ్యాంకు ఖాతాలతోపాటు వాటి నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయిన మరో 40 బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారు.
మరోవైపు ఈ స్కామ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు జోన్ 2 డీసీపీ స్మార్తనా పాటిల్ తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఆయా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.13 లక్షలను కూడా ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

