ముంబై : బాలీవుడ్ నటి పూనం పాండే భర్త సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు వేధింపులక గురిచేశాడని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భర్త దాడిలో తల, కండ్లు, ముఖంపై గాయాలైన పూనంను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
పూనం పాండే తన భర్త సామ్ అహ్మద్ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. తనను శారీరకంగా వేధించడంతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్నాడని 2020లో వివాహమైన రెండు వారాల తర్వాత పూనం తన భర్తపై ఫిర్యాదు చేయడంతో గోవాలో అతడని పోలీసులు అరెస్ట్ చేశారు. సామ్ బాంబేతో తెగతెంపులు చేసుకోవాలని కూడా అప్పట్లో ఆమె నిర్ణయించుకుంది.