Jairam Ramesh | అమిత్ షాపై ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కోరిన జైరాం రమేష్.. నిరాకరించిన ఈసీ
Jairam Ramesh | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. సోమవారం సాయంత్రం ఏడు గంటలలోగా ఆయన స్పందన తెలియజేయాలని పేర్కొంది.
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. సోమవారం సాయంత్రం ఏడు గంటలలోగా ఆయన స్పందన తెలియజేయాలని పేర్కొంది. లేని పక్షంతో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కాగా, శనివారం చివరి ఏడో దశ పోలింగ్ ముగిసిన తర్వాత జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జిల్లా కలెక్టర్లకు అమిత్ షా నేరుగా ఫోన్ చేసి భయపెడుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పటి వరకు ఆయన 150 మందితో మాట్లాడారు. ఇది కఠోరమైన, నిర్భయమైన బెదిరింపు. బీజేపీ ఎంత నిరాశకు గురైందో ఇది తెలియజేస్తోంది. అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దు. రాజ్యాంగాన్ని సమర్థించాలి. వారు నిఘాలో ఉన్నారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
మరోవైపు అమిత్ షాపై జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఏ జిల్లా కలెక్టర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పేర్కొంది. కౌంటింగ్‌పై ప్రభావం చూపే ఈ ఆరోపణలపై సోమవారం సాయంత్రం ఏడు గంటలలోగా ఆధారాలు సమర్పించాలని జైరాం రమేష్‌కు ఆదివారం లేఖ రాసింది. ఆయన వారం రోజులు సమయం కోరగా ఈసీ నిరాకరించింది. ‘నిర్ణీత సమయానికి ప్రతిస్పందన తెలియజేయలేకపోతే ఈ విషయంలో మీరు చెప్పేది ఏమీ లేదని భావిస్తాం. ఎన్నికల కమిషన్ తగిన చర్య తీసుకుంటుంది’ అని ఆయనకు బదులిచ్చింది.
The outgoing Home Minister has been calling up DMs/Collectors. So far he has spoken to 150 of them. This is blatant and brazen intimidation, showing how desperate the BJP is. Let it be very clear: the will of the people shall prevail, and on June 4th, Mr. Modi, Mr. Shah, and the…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- Claim
- denies
- Extra time
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

