గాయపడిన మహిళను 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన పోలీసులు
పోలీసులు | ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ పట్ల పోలీసులు మానవత్వం చాటి ప్రాణాలు కాపాడారు. మహారాష్ర్టలోని ఖండలా, కార్జత్ మధ్యన

ముంబై : ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ పట్ల పోలీసులు మానవత్వం చాటి ప్రాణాలు కాపాడారు. మహారాష్ర్టలోని ఖండలా, కార్జత్ మధ్యన ఉన్న పశ్చిమ కనుమల్లో రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా.. ఓ మహిళను రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. మహిళను గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మహిళను చూసి చలించిపోయారు.
అక్కడ్నుంచి ఆస్పత్రికి తరలిద్దామంటే అంబులెన్స్ సౌకర్యం లేదు. చేసేదేమీ లేక కర్రలతో ఓ స్ర్టెచర్‌ను తయారు చేశారు. దానిపై క్షతగాత్రురాలిని పడుకోబెట్టి సుమారు 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు. పలాస్దారి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే అంబులెన్స్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పుణెకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలిని ఆశా వాఘమేర్(42)గా పోలీసులు గుర్తించారు. కార్జత్ కొండల్లోని ఓ కుగ్రామంలో మహిళ నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే మహిళను 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన పోలీసులపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

